ఘనంగా ‘తానిపర్తి’ జన్మదిన వేడుకలు
గోదావరిఖని, జూన్ 12, (జనంసాక్షి):
జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యులు తానిపర్తి గోపాల్‌రావు జన్మదిన వేడుకలను మంగళవారం ఆటో డ్రైవర్స్, ఓనర్స్ యూనియన్ బాద్యులు ఘనంగా నిర్వహించారు. యూనియన్ కార్పొరేషన్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బర్త్ డే కేకును గోపాల్‌రావు కట్ చేయగా, అనారోగ్యంతో కాళ్లను పోగొట్టుకున్న కుమార్ అనే ఆటోడ్రైవర్‌కు ఆర్థిక సహాయాన్ని అందించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈర్ల అయిలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు జంగంపల్ల పోశం, ఎండి.అన్ను, జనగామ రవీందర్‌రావు, ఓదేలు, నేరెళ్ళ రాజు, రహీం, మాటేటి శ్రీను, ఎం.నర్సింగరావు, అఫ్జల్, పోరండ్ల మురళీ, నేరెళ్ళ నారాయణ, పి.లింగయ్య తదితరులు పాల్గోన్నారు. అలాగే… స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేసి…
బీదలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లాల శ్రీనివాస్, కండె కృష్ణ, మాటేటి రాజేశం, పెనుగొండ రాజయ్య, బాపు, ప్రకాష్, సోమయ్య, మల్లేష్, రాజయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.