ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
డోర్నకల్: డోర్నకల్‌లో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానికి ఎన్టీఆర్ విగ్రహానికి మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి బాబు పూలమాలలు వేశారు. పట్టణ అధ్యక్షుడు వెంకన్న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి హనుమ, మండల కార్యదర్శి కిశోర్ పాల్గొన్నారు.