Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > నిజామాబాద్ > Main > ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు / Posted on June 2, 2022
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నాడు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని, ఎంతోమంది అమరవీరులయ్యారని, తెలంగాణ ప్రజల తిరుగుబాటును చూసి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని,అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి సంపాదించిన తెలంగాణలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతోందని రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా సామాజిక తెలంగాణ ఏర్పాటు చేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో లో వైస్ ఎంపీపీ నర్సింహులు, నాగం పరంధాములు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పచ్చిగండ్ల ప్రశాంత్, లింగేష్,రవి నాయక్,గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.