ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
జనంసాక్షి / (చిగురుమామిడి) సెప్టెంబర్ 17: కరీంనగర్ జిల్లా
చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాలతో పాటు మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శనివారం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించాగా తహశీల్దార్ కార్యాలయంలో సయ్యద్ మొబిన్ అహ్మద్, పోలీస్ స్టేషన్లో ఎస్సై దాస సుధాకర్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో రంజిత్ రెడ్డి, పిఎసిఎస్ కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో బిజెపి, సిపిఐ,టీఆర్ఎస్ కార్యాలయాల ముందు జాతీయ జెండాను ఆయా శాఖ అధ్యక్షులు ఎగరవేశారు. అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఇందుర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ అందే స్వరూప స్వామి జెండా ఎగరవేశారు.ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ రావు జెండాను ఎగరవేశారు. వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.