ఘనంగా దామోదరం సంజీవయ్య వర్ధంతి
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని పీసీసీ ఘనంగా నిర్వహించింది. నాంపెల్లి పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పీసీసీ అధినేత బొత్స పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోస్టల్ ప్రక్షాళన. కార్మిక చట్టాల రూపకల్పన దళితుల సంక్షేమానికి విశేష కృషి చేసిన మహా వ్యక్తి సంజీవయ్య అని కొనియాడారు.