ఘనంగా నాగుల చవితి
మంథని, జనంసాక్షి: మంథని మండలంలోని పలు గ్రామాల్లో , మంథని పట్టణంలో నాగుల చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంథని పట్టణంలోని తమ్మచెరువు కట్ట నాగేంద్ర ఆలయంలో పెద్ద ఎత్తు మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. గాజులపల్లిలోని సంతాన నాగేంద్ర స్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున మహిళలు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.