ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం..
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 21 : సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు మండలాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చేర్యాల నేతాజీ రోడ్డు వద్ద అమరవీరుల స్థూపనికి చేర్యాల సీఐ ఎం. శ్రీనివాస్, ఎస్ఐ భాస్కర్ రెడ్డి, ఏఎస్ఐ నవీన్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మద్దూరు ఈద్గా దగ్గర పోలీస్ అమరవీరుల స్థూపానికి ఎస్సై నారాయణ,ఏ ఎస్సై,జగదీశ్వర్ గ్రామ సర్పంచ్ జనార్దన్ రెడ్డి,ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థులు హాజరై అమరవీరుల సేవలను గుర్తు చేసుకొని నివాళులర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిత్యం పోరాడుతున్నారని, ప్రజలను కాపాడేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఆపద సమయంలో ‘మేమున్నాం’ అంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ఆత్మరక్షణలో ఉండిపోతే పోలీసులు ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు సాగుతున్నారు. అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను రక్షించే ప్రయత్నంలో ఎంతో మంది పోలీసులు సమిదలుగా మిగిలి పోతున్నారు. అలాంటి వారిని స్మరించుకునేందుకు ఏటా అక్టోబరు 21న పోలీసు అమర వీరుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. ఎంతోమంది పోలీసు అమరవీరుల త్యాగ ఫలితమే ఈరోజు ఇంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనిక జవానులైతే అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు అన్నారని వారు తెలిపారు.