ఘనంగా ప్రారంభమైన లింగమంతుల జాతర
దురాజ్‌పల్లి(చివ్వెంల) జనంసాక్షి : నల్గొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలో లింగమంతుల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టెను లింగమంతుల స్వామి పెద్దగట్టుపైకి చేర్చారు. అనంతరం దేవరపెట్టెను లింగమంతుల స్వామి, ాడమ్మ ఆలయాల నడుమ ప్రతిష్ఠించారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని దేవరపెట్టె వద్ద ప్రత్యేక పూజలు చేశారు. యాదవభక్తులు సంప్రదాయాలకు అనుగుణంగా గజ్జెల లాగులు ధరించి బ’ారీల చప్పుళ్లతో, కటారుల విన్యాసాలతో సంబరాలు చేస్తూ ప్రత్యేకంగా అలంకరించిన గంపలతో దేవుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులు లింగమంతుల స్వామికి బోనాలు చెల్లించి ాడమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. లక్షలాదిగా భక్తులు జాతరకు తరలివస్తున్నారు.