ఘనంగా బోనాల పండుగ వేడుకలు
ఖానాపూరం ఆగష్టు 7జనం సాక్షి
వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మండలంలోని ధర్మారావు పేట గ్రామంలో గ్రామ సర్పంచ్ శృతి పూర్ణచందర్ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను నిర్వహించారు. గ్రామదేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. . డప్పువాయిద్యాల మధ్య బోనాలను ఊరేగిస్తూ పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో బోనాలు, నైవెద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే అశోక్ నగర్ గ్రామంలో నేతకానీ కులం దైవం ముత్యాలమ్మ తల్లి బోనాల పండగ అశోక్ నగర్ గ్రామం లో ఇందిరా కాలనీ లో కుల పెద్దలు చెన్నూరి సారంగపాణి, జనగాం రమేష్, ఆధ్వర్యంలో హోమాలు పూజలు నిర్వహించి బోనాలు మొక్కులు చెల్లించుకున్నారు.