ఘనంగా మహోపాధ్యాయుడు మావో 46 వ వర్ధంతి
టేకులపల్లి ,సెప్టెంబర్ 9( జనం సాక్షి ): మార్క్సిస్టు మహూపాధ్యాయుడు మావో 1976 సెప్టెంబర్ 9న మరణించి నేటికి 46సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయన 46వ వర్ధంతిని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
83 సంవత్సరాల వయసు తుది శ్వాస విడిచే వరకు విప్లవ పుణీతను అన్వయించి ఆచరించిన దీశాలి అన్నారు. చైనా దేశంలో మార్క్సిజం ,లెనినిజం ని అన్వయించి ఆ దేశ ప్రజలకు స్ఫష్టమైన విప్లవం నిర్దిష్ట మార్గాన్ని అందించారు అని అన్నారు.
భూస్వామ్య విధానం, సామ్రాజ్యవాదం కుమ్మక్కై చైనా దేశాన్ని ప్రజలను కొల్లగొట్టబడ్డాయని
పెట్టుబడిదారీ వర్గం సామ్రాజ్యవాదులకు పట్టణాల్లో దోపిడి చేసుకోవడానికి పునాదిగా వ్యవహరించింది అన్నారు. అందుకే చైనాను అర్ధ వలస అర్థ భూస్వామ్య దేశంగా సూత్రీకరించింది
గ్రామాలను విముక్తి చేయకుండా పట్టణాలను విముక్తి చేయడం సాధ్యం కాదని పైన పేర్కొన్న మూడు వర్గాలకు వ్యతిరేకంగా దేశంలోని మిగతా వర్గాల ఐక్యం చేయాలి అని మావో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.