ఘనంగా మాజీ ప్రధాని జయంతి
భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా పరిగిలో వారి విగ్రహాన్ని కి నివాళులు అర్పించి ఘనంగా జయంతి ఉత్సవ వేడుకలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే DCC అధ్యక్షులు T.రామ్మోహన్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశంలో పేదవారికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఇందిరా గాంధీ అన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు భూమి లేని వారికి భూమి అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు వివిధ రక రకాలుగా వ్యవసాయ రంగానికి పెద్ద వేయడం మహిళలను ముందుకు తీసుకొచ్చే విధంగా అనేక సంక్షేమ పథకాలు అదేవిధంగా మహిళలకు రుణాలు ఈ విధంగా రకరకాల దేశాన్ని అభివృద్ధి పథకంలో తీసుకువచ్చిన ఘనత ఆమెదే అని అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్, ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, పరిగి మండల అధ్యక్షులు పరశురాం రెడ్డి , కౌన్సిలర్ మల్లేష్ యాదవ్ ,కాంగ్రెస్ నాయకులు ఆనేమ్ ఆంజనేయులు, చిన్న నరసింహులు, అక్బర్ హుస్సేన్, ఖదీర్, నసీర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగ వర్ధన్, కుడుముల వెంకటేష్, రాజ్ పుల్లారెడ్డి శివకుమార్, జగన్, సర్వర్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎర్రగడ్డ పల్లి జగన్ రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఎజాజ్, హరి చందర్,అనంతరెడ్డి, బాలు, హైమద్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.