ఘనంగా మాజీ ప్రభుత్వ విప్ అనిల్ జన్మదిన వేడుకలు
భీమ్‌గల్, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్ మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రటరీలు కుంట రమేష్, డిస్ రవి, సీనియర్ నాయకులు పర్స అనంతరావు, మల్లికా గంగాధర్, సాదుల్ల, రాములు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వాకా మహేష్, చరణ్ గౌడ్, రాజేష్, సాయిమురారి సురేష్, చిన్న రెడ్డి, నరేష్ శివ గణేష్ రవి తదితరులు పాల్గొన్నారు.