ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
డోర్నకల్ అక్టోబర్ 9 జనం సాక్షి
మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆదివారం మిలాద్-ఉన్-నబీ వేడుకలు పట్టణ ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉస్మానియా మజీద్ ను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పట్టణ వ్యాప్తంగా శాంతి ప్రదర్శన నిర్వహించారు.మజీద్ అధ్యక్షులు రజాలి,మత పెద్ద సుల్తాన్ మోల్సబ్ మాట్లాడుతూ..
మహమ్మద్ ప్రవక్త చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు శాంతియుతంగా సోదరభావంతో మెలగాలని అదేవిధంగా తోటివారికి సహాయం అందించే విధంగా ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంత భాగం పేదవారికి అందించాలని తెలిపారు.ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలన్నారు.అనంతరం ఒకరినొక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.పోలీసులు బందోబస్తు నిర్వహించారు.కార్యక్రమంలో పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌస్ పాషా,కో ఆప్షన్ అజిత్ మియా,
జావిద్,సలీం, బాబా,అఖిల్,యువకులు తదితరులు పాల్గొన్నారు.