ఘనంగా ముగిసిన స్టేట్ లెవల్ చైల్డ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్…
కలెక్టరేట్ జూలై
(జనం సాక్షి): కీ.శే.మసురం పుల్లయ్య 92వ జయంతిన పుల్లయ్య కళానిలయం అధ్వర్యంలో జనగామ జిల్లా గ్రంథాలయంలో మూడు రోజుల పాటు జరిగిన స్టేట్ లెవల్ చైల్డ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ 2022 ఆదివారంతో ఘనంగా ముగిశాయి. కార్యక్రమ నిర్వాహకులు కళానిలయం వ్యవస్థాపకులు మసురం రాజేంద్రప్రసాద్ నిర్వహణ సారథ్యంలో విద్యార్థిని, విద్యార్థులు సమాజిక స్పృహతో వేసిన చిత్రలేఖనం ప్రదర్శించారు.
ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పాట్ పెయింటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించగా 40 మంది పాల్గొనగా 17 మంది ప్రతిభ కనబరచినవారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన మనస్వీని, హైదరాబాద్ కు చెందిన విస్వీత్, జనగామ జిల్లా పెంబర్తికి చెందిన జి. నవ్యశ్రీ చిత్రకళ ప్రదర్శన ఏ ర్పాటు చేశారు. ముగింపు కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్మన్ పోకల జమున ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులలో నిగూఢమైన చిత్రకళలను వెలికి తీయడంలో ఈ పోటీలు చక్కగా ఉపయోగపడుతాయని అన్నారు. నిర్వాహకులు రాజేంద్రప్రసాద్ సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈకార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ జనగామ జిల్లా చైర్మన్ పోకల లింగయ్య, కవి హృదయం సాహిత్య వేదిక అధ్యక్షుడు పెట్లోజు సోమేశ్వరాచారి, జి.వై.గిరి పౌండేషన్ చైర్మన్ జి.కృష్ణ, జనగామ రచయితల సంఘం అధ్యక్షులు అయిలా సోమనర్సింహచారి, శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు లగిశెట్టి ప్రభాకర్, చిలుమోజు సాయికిరణ్, వాసవి గెలాక్సీ క్లబ్, కార్యదర్శి కాసాల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.