ఘనంగా రక్షా బంధన్‌

3

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,ఆగస్టు 18(జనంసాక్షి):  రాఖీ పండుగను దేశవ్యాపంగా ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెల్ల అనుబంధానికి రాఖీ వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టారు.ఢిల్లీ బీజేపీ ఆఫీసులో జరిగిన రాఖీ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మోదీకి చిన్నారులు రాఖీ కట్టారు. వారితో ప్రధాని కాసేపు ముచ్చటించారు. /ూఖీ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలందరికీమోదీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె.ఆడ్వాణీ, కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే సరిహద్దుల్లో ఉన్న సైనికులకు పలువురు రాఖీలు కట్టారు. పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాఖీపండుగ జరుపుకున్నారు. జవాన్లకు రక్షాబంధన్‌ కట్టిన ఆమె అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పంజాబీ పాటలకు కళాకారులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. తెలుగు రాస్ట్రాల్లోనూ పండగను ఘనంగా జరిపారు. శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో  రాఖీ పండగ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. రాఖీని  పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఉదయం 11.00 గంటలకు ఈ వేడుకల్లో గవర్నర్‌ దంపతులు.. నగర వాసులు పాల్గొనున్నారు. పలువురు విద్యార్థులు గవర్నర్‌కు రాఖీ కట్టారు. పాఠశాల విద్యార్థులు, మహిళలు, పలు రంగాల ప్రముఖులు, అధికారులు గవర్నర్‌ నరసింహన్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఫోటోలు దిగారు. నరసింహన్‌ కూడా వారిని ఆప్యాయంగా పలకరించి వారికి స్వీట్లు అందించారు. వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా  ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్‌ అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. సమాజంలో ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి కవిత రాఖీ కట్టారు. అనంతరం ఆయనకు స్వీట్‌ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మకుమారీలు కూడా కేటీఆర్‌కు రాఖీలు కట్టారు. ఆయన రాష్ట్ర ప్రజలకు ఓ సోదరుడిగా నిలిచారని.. ఆయన చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉదయమే సీఎం క్యాంప్‌ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. అనంతరం సోదరుడు కేటీఆర్‌ చేతికి రాఖీ కట్టి.. స్వీట్‌  అందించారు. ఈ వేడుకల్లో కేటీఆర్‌ కుటుంబ సభ్యులతోపాటు కవిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  తెలంగాణ తమ్ముళ్లకు రాఖీ కట్టి కవితక్క సోదర, సోదరీ భావాన్ని చాటిచెప్పారు. ఈమేరకు  కవిత తన నివాసంలో రక్షా బంధన్‌ వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కవిత పలువురు టీఆర్‌ఎస్‌ శ్రేణులకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. రాఖీ పండుగ అందరికి కొత్త సంతోషాన్ని తీసుకురావాలని కవిత ఆకాంక్షించారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి పరిటాల సునీత, సీతక్క, గ్దదె అనురాధలు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సునీత, సీతక్క, గ్దదె అనురాధ చంద్రబాబు నివాసానికి వెల్లి రాఖీ కట్టారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులకు తమ ప్రభుత్వం రక్షణ కల్పించిందన్నారు. మహిళా సంక్షేమం కోసం తల్లీ-బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌, షిఆటో పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. అన్న అమృతహస్తం కింద తల్లులకు

పోషకాహారం అందిస్తున్నామన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించినట్లు తెలిపారు. పేద ముస్లిం యువతులకు దుల్హన్‌,గిరిజన యువతులకు గిరిపుత్రిక కల్యాణ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఏపీ విపక్ష నేత, వైసీపీ అధినేత రాఖీ పండుగ జరుపుకున్నారు. రక్షాబంధన్‌ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు