ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం…
జనగామ కలెక్టరేట్ ఆగస్టు 10(జనం సాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా బుధవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి ఘనంగా నిర్వహించారు.జిల్లా కలెక్టర్ శివలింగయ్య డిసిపి సీతారాం,అదనపు కలెక్టర్లు భాస్కరరావు, అబ్దుల్ హమీద్,ఈవీఎం గోదాం ఆవరణలో అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.75 సంవత్సరాలను పురస్కరించుకొని అటవీ శాఖ 75 మొక్కలను ఒకచోట నాటింపజేసిన విధానాన్ని కలెక్టర్ సందర్శించి తిలకించారు.
జనగామ మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డులో మెప్మా మహిళలతో ఫ్రీడమ్ పార్క్లో అందమైన వివిధ రకాల గులాబి పూల మొక్కలు నాటుతూ మహిళలచే నాటింపజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోకల జమున, డిసిపి సీతారాం, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, ఆర్డిఓ మధుమోహన్, మున్సిపల్ కమిషనర్ రవీందర్,1వ వార్డుకౌన్సిలర్ అరుణ విజయ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.