ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు, హాజరైన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్17,జనంసాక్షి,, నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్ చౌరస్తాలో జరుగుతున్న విశ్వకర్మ జయంతి వేడుకలకు శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పి ఛైర్పర్సన్ జిల్లా పాలనాధికారి హాజరయ్యారు విశ్వకర్మ కు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ స్వయంభు అని విశ్వానికి సృష్టిగా పరిగణించబడ్డాడని, విశ్వానికి మొదటి కార్యం చేసేది విశ్వకర్ముడేనని మంత్రి తెలిపారు ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిన్ననే జీవో విడుదల చేసిందని మంత్రి తెలిపారు ప్రస్తుతం ఉన్న భవనం చిన్నదిగా ఉన్నందున వచ్చే సంవత్సరం ఒక మందిరాన్ని మంజూరు చేసి వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు
ఈ కార్యక్రమంలో , అదనపు కలెక్టర్ హేమంత్, బిసి వెల్ఫేర్ రాజేశ్వర్,
ము న్సిపల్ చైర్మన్ జి. ఈశ్వర్,మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, అల్లోల మురళీధర్ రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, తెరాస నాయకులు పాకాల రామచందర్, కోటగిరి అశోక్, ,కౌన్సిలర్లు,విశ్వ బ్రాహ్మణ కుల సభ్యులు కత్రోజ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు
Attachments area