ఘనంగా విశ్వకర్మ జయంతి..
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని శనివారం మండల విశ్వకర్మ ,విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల సంఘం మండల బాధ్యుడు కొండపాక ప్రసాద్ మాట్లాడారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని మండలంలోని కేశవపట్నం శివారులో వెంకయ్య గుట్ట వద్ద విశ్వకర్మ జెండాను ఎగురవేసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ముత్తోజు స్వామి, జక్కోజు రమేష్, మధుకర్, రమేష్ ,రాజు, శ్రీనివాస్, రవి, దేవరాజు, కోటి, రవీందర్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.