ఘనంగా వెంకటేశ్వర కళ్యాణం..

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 10 టేక్మాల్ మండల  కేంద్రంలో  వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర కళ్యాణం మాజీ ఎంపిటిసి కమ్మరి సిద్దయ్య దంపతుల చేతులమీదగా ఘనంగా నిర్వహిస్తున్నారు.అనంతరం అన్న వితరణ ప్రసాదం  కార్యక్రమం సిద్దయ్య దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సిద్దయ్య మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం మా దంపతుల చేతుల మీదుగా జరగడం సంతోషకరంగా ఉందన్నారు,గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని  కోరుకున్నారు.ఈ కార్య క్రమంలో ముఖ్య అతిధిగా శ్రీ శ్రీ మాధవనంద స్వామి వారు పాల్గొన్నారు. మరియు మహిళలు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారి దర్శించుకున్నారు.