ఘనంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతం
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి);స్థానిక శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రావణమాసపు చివరి మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు.పసుపు కుంకుమలతో సుమంగళిగా ఉండాలని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామ కృష్ణ శర్మ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ శ్రావణ మాసంలో అతి ముఖ్యమైన వ్రతాలలో మంగళ గౌరీ దేవికి ప్రాముఖ్యత ఉందన్నారు.నూతనంగా పెళ్లయిన దంపతులు శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాలు ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతం నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు.గత పది సంవత్సరాలుగా శ్రావణమాసంలో ఈ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం మహిళలు మంగళ హారతులు పట్టి అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడారు.ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా , బ్రహ్మాండ్లపల్లి మురళీధర్, ఉపాధ్యక్షులు నరేంద్రుని విద్యాసాగర్ రావు, అన్నదాన నిర్వాహకులు కొత్త మల్లికార్జున్ ,దేవరశెట్టి సోమయ్య , పబ్బా ప్రకాష్ , బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య , తాళ్లపల్లి రామయ్య , నామిరెడ్డి పాపిరెడ్డి , కక్కిరేణి పద్మ, బచ్చు నీరజ, గుండా సువర్ణ , పాటి వనజ, కంచర్ల లీల,దేవాలయ అర్చకులు మంగిపూడి వీరభద్ర శర్మ , భట్టారం వంశీకృష్ణ శర్మ ,దేవాలయ మేనేజర్
బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.