ఘనంగా సంతోషిమాత జన్మదినోత్సవ వేడుకలు
శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి :మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామంలో కొలువైన సంతోషిమాత దేవాలయంలో శ్రావణ శుక్రవారం పౌర్ణమి, అలాగే అమ్మవారి జన్మ తిధి కూడా కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వహణ అర్చకులు శాస్త్రుల దేవాదత్తుశర్మ దంపతులు అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేపట్టారు. ఆ తర్వాత భక్తులు వరుస క్రమంలో కూర్చుండి కుంకుమార్చనలు చేశారు. అమ్మవారిని నూతన వస్త్రాలతో అలంకరించి భక్తులు, అర్చకులు ఓడి బియ్యం సమర్పించారు. చివరగా మంత్రపుష్పం పట్టించి, తీర్థ ప్రసాధాలు స్వీకరించారు.