ఘనంగా సింగరేణి 53వ రక్షణ పక్షోత్సవాలు
సింగరేణి భవిష్యత్ ఉద్యోగుల పై ఆధారపడి ఉంది.
యాజమాన్యానికి రక్షణ, ఉత్పత్తి రెండు కళ్ళ లాంటివి
పలువురుని ఆకట్టుకున్న “కనువిప్పు” నాటిక
పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 15 (జనం సాక్షి):ఉద్యోగుల పైనే సింగరేణి భవిష్యత్తు ఆధారపడి ఉందని రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఏరియా ప్రధాన అధికారి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న 53వ రక్షణ పనోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం ఎల్వీ సూర్యనారాయణ జిఎం ఎక్స్ ఫోజివ్స్ అండ్ బ్లాస్టింగ్ ట్రాన్స్డ్స్ఫర్డ్ సర్వీసెస్ కార్పొరేట్) కన్వీనర్ గా సభ్యులు బాలరాజు సరిత కుమార్, శంకర్ రావు , చంద్రశేఖర్, ఎస్. ధనంజయ రెడ్డి, దేవి శ్రీ భాస్కరరావు, రాజు నాయక్ లు మల్లేపల్లి ఓసిని సందర్శించి రక్షణ చర్యల పై తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా గవి ఆవరణలో జరిగిన సమావేశంలో వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యానికి రక్షణ ,ఉత్పత్తి రెండు రెండు కళ్ళు లాంటివని ఎంత గొప్పగా ఉత్పత్తి పాదించిన ఏ చిన్న సమాద సంఘటన జరిగినా. ఆ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని మనపై వ్యతిరేక ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. సింగరేణి భవిత భవిష్యత్ లో కూడా నేటి యువతరం కార్మికులపై ఉందని కారుణ్య నియామకాల ద్వారా విదేశీ ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్న వారు సైతం సింగరేణి ఉద్యోగాలకు ఆసక్తి కనపరుస్తున్నారని, ఆసక్తితో పాటు సింగరేణి భవిష్యత్తుపై కూడా కచ్చితంగా ఆలోచన దిశగా వారు పని చేయాలని రక్షణ కూడా అత్యంత ముఖ్యమైన అంశం అని ఆయన అన్నారు. రక్షణ బృందం కన్వీనర్ ఎల్వీ సూర్యనారాయణ గతం కన్నా ఇప్పుడు మణుగూరు లో రక్షణ చర్యలు చాలావరకు మెరుగుపడ్డాయని నిన్నటి కన్నా నేడు మెరుగ్గా ఉండాలని నేటి కన్నా రేపు మరింత పురోగతి సాదించాలని ఆ దిశగా ఆలోచించే ఏ కంపెనీ అయినా నేటి పోటీ ప్రపంచంలో మనుగడ కొనసాగించగలడని ఆయన అభిప్రాయపడ్డారు ఉత్పత్తి రక్షణ నాణ్యత ఈ విషయాలపై రాజీ పడవద్దు. అలాగే ప్రమాద రహిత సింగరేణికై యాజమాన్యం చేపడుతున్న రక్షణ చర్యలలో సింగరేణి ఉద్యోగుల తో పాటు కాంటార్ట్ కార్మికులు ఓసి కార్మికులు సైతం భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. గుర్తింపు సంఘం ఏరియా ఉపాధ్యక్షులు వి. ప్రచాకర్ రావు మాట్లాడుతూ రక్షణ పై పలు సలహాలు సూచనలు ఇచ్చారు. బ్రెడ్ రెస్ట్ లో వృత్తి నైపుణ్యత కనబరిచిన వారిని అధికారులు అభినందించారు. ఎస్ డి నాసర్ పాషా, ఈ వి ఆపరేటర్, దర్శకత్వంలో ఏరియా సింగరేణి కళాకారులు ప్రదర్శించిన “కనువిప్పు” రక్షణ సందేశాత్మక వాటికి అందరిని ఆలోచింపజేసింది అధికారులు వారి నటనను కథను ఆభినందిస్తూ బహుమతులు అందజేశారు.అనంతరం గని వర్క్ షాప్ లు తదితర సెక్షన్లలో రక్షణ బృందం సభ్యులు విస్తృతంగా పర్యటించారు. తనిఖీ అనంతరం ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో జరిగిన సమీక్ష
సమావేశంలో ఆధ్యక్షుడు సంబంధించిన పలు సూచనలు కూడా చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రాజెక్టు
అధికారి కార్యాలయ ఆవరణలో అతిథులు ఆహ్వానితులచే మొక్కలు నాటించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీఎం లలిత కుమార్ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసాచారి, ఏరియా గుర్తింపు సంఘం ఉపాద్యక్షులు వి ప్రభాకర్ రావు, ప్రాజెక్ట్ ఇంజనీర్ బి రవీందర్ గని మేనేజర్ రాజేశ్వరరావు, రక్షణ అధికారి బాస్కర్, అనిల్, ఏరియా అధికారులు ఏరియా సిఫ్టీ ఆఫీసర్ ఫ్రీ టినీ రమణ, ఏరియా ఇంజనీర్ పెద్ద రాల్డ్, సంక్షేమ కాష్ , ఇంజనీర్లు ఎస్సీ పై తిరుమల్, గుర్తింపు సంఘం నాయకులు కోట శ్రీనివాస్, ఎండీ ఇంతియాజ్ పాపా, సాగర్, రెడ్డి బాబు, సినీ సెఫ్టీ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున సింగరేణి కార్మికుల కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.