ఘనంగా సిరిపూర్ లో సీత్ల భవాని పండుగ …..
మల్లాపూర్, (జనంసాక్షి) జులై :26 మండలలోని సిరిపూర్ గ్రామంలో మంగళ వారం ఏడు గురు అమ్మవార్లను సీత్ల మాత ఆధ్వర్యంలో కొలువు దీర్చి పంట పైరు బాగుండాలి, గో సంపద బాగుండాలి అని ప్రపంచ వ్యాప్తంగ ఆషాఢ మాసం లో శుక్ల పక్షం లో మంగళవారం రోజున ప్రపంచ బంజారాలు జరుపుకునే పండగ సీత్ల భవాని పండుగ.
ప్రపంచ బంజారా ల ఆరాధ్య దైవాలు అయిన క్యంకాళీ (కాళిక మాత) యాడీ, తోల్జా (తులజ భవాని) యాడీ, మ్యారామ (జగదాంబ మాత) యాడీ, సీత్ల యాడీ(సీతమ్మ మాత), మంత్రాల్(మంత్రాల్ మాత) యాడీ, హింగ్లాజ్ యాడీ(హింగ్లాజ్ మాత), ద్వాల్ అంగల్ యాడీ ఇలా ఏడు అమ్మ వార్లను కొలిచే పండుగ సీత్ల భవాని పూజ…
ఇప్పటికీ అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ల ప్రకారం లంబాడీ గిరిజన తెగలు జరుపుకునే సీత్ల భవాని పండుగ, తీజ్ ఉత్సవాలు, సేవాలల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను సెలవుల జాబితాలో చేర్చాలి అని మనవి జగో బంజారా మరో నంగారా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నునావత్ రాజు ప్రభుత్వ నికి విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రతి తండా పంచాయతీ లలో గిరిజన లంబాడీ తెగల పండగలను ప్రభుత్వమే నిర్వహించాలని జగో బంజారా మరో నంగారా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నునావత్ రాజు విన్నవించారు.ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్, నునావత్ రాజు,నునావత్ విట్ఠల్ నాయక్,బాధవత్ రాము నాయక్,నునావత్ రాజు,బాధవత్ సుధాకర్ నాయక్,నందు నాయక్, గుగ్లవత్ రాజేందర్ నాయక్,తిరుపతి నాయక్, నునావత్ శ్రీమాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.