ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
హైదరాబాద్: ఈసిఐఎల్ లో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈసీఐఎల్ చౌరస్తాలో బహిరంగసభ నిర్వహించారు. బహిరంగసభకు ఆ సంఘం అఖిలభారత అధ్యక్షుడు పద్మనాభన్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు హాజరయ్యారు.