ఘనంగా స్వచ్ఛ దివస్ వేడుకలను నిర్వహించిన మహిళా సమాఖ్య ప్రతినిధులు

 

జనం సాక్షి,చెన్నారావుపేట

జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు స్వచ్ఛత దివస్ ను మండలంలోని ఆశాజ్యోతి మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ఆధ్వర్యంలో మండలంలోని మహిళా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని,మరుగుదొడ్లు కుటుంబ గౌరవానికి గుర్తుగా, మానవ అభివృద్ధి సూచికగా, ఉన్న వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్య ప్రామాణికతను పెంచుకోవచ్చని దీనికి గుర్తుగా ఈరోజు స్వచ్ఛత దివస్ ను పాటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ భారతి గ్రామైక్య సంఘం అధ్యక్షులు హంస స్వప్న, సరిత, వివోఏలు మంజుల, శ్యామ్, వెంకటేశ్వర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.