ఘనంగా స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు…

– 8 నుండి 21 వరకు స్వాతంత్ర సంబరాలు.
– ఎంపీడీవో ప్రభాకర్.
ఊరుకొండ, ఆగస్టు 10 (జనం సాక్షి):
స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని ఇప్ప పహాడ్, జకినాలపల్లి, గుండ్లగుంటపల్లి, నర్సంపల్లి, ఊరుకొండ పేట, మాదారం, జగబోయినపల్లి, గుడి గాని పల్లి, ముచ్చర్లపల్లి, రామ్ రెడ్డి పల్లి, బొమ్మ రాసి పల్లి తదితర గ్రామాలలో మొక్కల ద్వారా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 ను మొక్కలతో అలంకరించి జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆయా గ్రామాల సర్పంచులు దండోత్కర్ అనిత నాగోజి, వనజ బాలస్వామి, ఆంజనేయులు, రజిత కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రభాకర్ మాట్లాడుతూ… ఆగస్టు 8న
ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీతో ప్రారంభమై… 10న ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 75 మొక్కలతో ఫ్రీడమ్ ప్లాంటేషన్, 11న ఫ్రీడమ్ రన్… ఊరుకొండ మండల కేంద్రం నుండి ఊరుకొండ పేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వరకు, 13న అన్ని గ్రామ పంచాయతీలలో ఫ్రీడమ్ ర్యాలీలు, 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, 16న అన్ని గ్రామ పంచాయతీలలో జాతీయ గీతాలాపన ప్రభుత్వ పాఠశాల, పంచాయతీ బాణాల వద్ద ఉంటుంది. 18న ఉద్యోగస్తులకు, యువకులకు ఫ్రీడమ్ కప్ క్రీడల నిర్వహణ. 20న అన్ని గ్రామ పంచాయతీలలో రంగోలి పోటీలు నిర్వహించడం. 21న మండల కేంద్రంలో ఎంపీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.