ఘనంగా 75వ స్వతంత్ర భారత్ వజ్రోత్సవ వేడుకలు

 

ముల్దకల్ ఆగస్టు 15 (జనం సాక్షి) 75వ స్వతంత్ర భారత్ వజ్రోత్సవ వేడుకలు మల్దకల్ మండలంలోని సోమవారము ఘనంగా జరుపుకున్నారు. ఉదయము ఆయా గ్రామాలలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు చేత ప్రభాతభేరి నిర్వహించారు. మల్దకల్ పోలీస్ స్టేషన్ ముందు ఎస్ ఐ ఆర్ శేఖర్ జెండా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. తహసిల్దార్ కార్యాలయం ముందు తహసిల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో కార్యాలయం ముందు ఎంపీపీ రాజారెడ్డి జెండా ఎగరవేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రిన్సిపల్ రమేష్ లింగం, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ యాకోబు ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద హెచ్ఎం ఇమ్మానియేల్ జాతీయ జెండాను ఎగరవేశారు.సింగిల్ విండో కార్యాలయం వద్ద అధ్యక్షుడు తిమ్మారెడ్డి,ప్రభుత్వ బాలుర వసతి గృహం వద్ద వార్డెన్ కృష్ణ, మండల మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమైక్య అధ్యక్షురాలు జండా ఎగరవేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ సుప్రీత, పశు వైద్యశాల వద్ద డాక్టర్ వినయ్ కుమార్, ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిడిపిఓ కమలాదేవి జెండా ఎగరవేశారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఏఈ దుర్గాప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్దఅధ్యక్షుడు వెంకటన్న జాతీయ పతాక ఎగరవేశారు.అంబేద్కర్ ,గాంధీ చౌక్ వద్ద,అమరవాయి బిజ్జారం, పాల్వాయి, విఠలాపురం,కుర్తి రావులచెరువు,తాటికుంట ఎల్కూరు,మద్దెలబండ తదితర గ్రామాలలో స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న ,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో కృష్ణయ్య, నాయబ్ తాసిల్దార్ మదన్ మోహన్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు శేషంపల్లి నరసింహులు,రామచంద్రారెడ్డి,నరేందర్,మధు,అజయ్, నరసింహారెడ్డి,ఆంజనేయులు, హైదర్ సాబ్, మహబూబ్ అలీ, నరసింహులు ,ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు