ఘాజ’లో జర్నలిస్టుల గోస!
‘ఘాజ’ లో జర్నలిస్టులు గోస పడుతున్నారు. పదుల సంఖ్యలో అక్కడ జనంలో మాదిరే ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు అని కూడా వార్తలు వస్తున్నాయి.ఇజ్రాయిల్ దాడి, వరుస బాంబుల వర్షం కారణంగా పాలస్థినా లోని ‘ఘాజ’ సగం ఖతం అయిపోయింది.23 లక్షల జనాభాలో 11 లక్షల మందిని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ పై నుంచి ఘాజ ప్రాంతంలో కరపత్రాలు కూడా పంచింది. మొత్తం జబర్దస్తీ లా పరిస్థితి కనిపిస్తున్నది. ప్రపంచంలోనే అంత్యంత బలోపేతం అయిన సైనిక ప్రధాన దేశం గా పిలువబడే ఇజ్రాయిల్ నుంచి విలువడే ‘హరెట్జ్ ‘పత్రిక ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు తానా షాహీ నేత గా,రక్షణ శాఖ మంత్రి ని గ్యాంగ్ లీడర్ గా పేర్కొన్నది. ఇజ్రాయిల్ పై హమాస్ దాడిని తీవ్ర చర్యగా పేర్కొంటూనే, తన పై దాడి తర్వాత, ఇజ్రాయిల్ ప్రతి చర్యగా ‘ఘాజ’మీద చేసిన దాడి, బాంబుల వర్షం కురిపించి 4,23,000 మందిని నిరాశ్రయులను చేయడం,11 లక్షల మందిని ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళండి అని పేర్కొనడాన్ని అమానవీయ చర్యగా పేర్కొన్నది. తాజాగా ‘ఘాజ’ లో 4 లక్షల మందికి మంచి నీళ్లు కూడా దొరకడం లేదు అంటున్నారు. మీడియా పర్సన్స్ అంతా ‘ఘాజ’ విధ్వంసం, నరసంహారం ఘటనలను ఎక్కువ శాంత ఇజ్రాయిల్ బోర్డర్ లోనే ఉండి కవర్ చేస్తున్నారు. అక్కడి రక్షణ మంత్రి ని గతంలో వివిధ ఆరోపణలతో తొలగించి, మళ్ళీ తీసుకున్నారు. ఇతన్ని, పీఎం నె తన్ యాహు ను అధికారంలో ఉన్న మనుషుల రూపంలో రాక్షసులు, జంతువుల మాదిరి ప్రవర్తిస్తున్నారు. అసలు ఇజ్రాయిల్ పీఎం ఏమి కోరుకుంటున్నాడు. ఒక వైపు సముద్రం, మారో వైపు ఇజ్రాయిల్ బోర్డర్ లో సైన్యం దాడులు, బయటకు కూడా ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో ఘాజ మీద ఇప్పటికే 6 వేల పై చిలుకు బాంబులు వేశారు, అంటారు.2001 లోనే అక్కడి ఎయిర్ పోర్ట్ ను కూడా బాంబులు వేసి భూ స్థాపితం చేశారు. నిజంగా రేపు ప్రపంచ వేదిక మీద ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని అతి పెద్ద తప్పు చేస్తున్నాడు ఇజ్రాయిల్ ప్రధాని అంటే అతిషయోక్తి కాదు.ఘాజ లోని ఒక భాగం లో 22,000 కు పైగా భవనాలు, గృహాలు నేల మట్టం చేసారు.మొత్తం 23 లక్షల జనాభాలో ఐదు లక్షల మంది ఇండ్ల నుంచి బయటకు వెళ్లి ఎటుపోయారో తెలియదు ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం ఘాజ లో ఉన్నది. ఈ పరిస్థితులలో పశ్చిమ ఏషియా లో జనం పరేషాన్ లో పడ్డారు.10 వరకు దవాఖానలా మీద కూడా బాంబుల దాడి జరిగింది అంటున్నారు. ఇదే సందర్బంగా ఎనిమిది మంది పాత్రికేయులు కూడా దాడి లో ఊపిరి కోల్పోయారు. పలువురు గాయపడ్డారు అంటున్నారు.ఇంటర్ నెట్ లేదు, ఫోన్ ల ఛార్జింగ్ లేని కారణంగా రిపోర్టింగ్ చేయలేని పరిస్థితి ఉందని, క్షమించాలని కొందరు నిజాయితీ పరులైన, జర్నలిస్టులు చెబుతున్నారు. బ్లెస్సి అనే ఒక మహిళా జర్నలిస్టు మాట్లాడుతూ తాను తన ఫోన్ ఛార్జింగ్ ను ఒక ఆసుపత్రి లో చేసుకుని,అక్కడే బట్టలు మార్చుకుని,అక్కడే షెల్టర్ తీసుకుంటు, పరిస్థితి ని వివరిస్తున్నట్లు ఒక వీడియో జారీ చేసింది. బ్లెస్సికి శిరస్సు వంచి నమస్కరిద్దాం! ఆమె ద్వారా నే కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎంతో ధైర్య సాహసా లను ప్రదర్శిస్తున్న ఈ మహిళా జర్నలిస్టు తాను ఉన్న చోటు పై ఎప్పుడు బాంబులు పడుతాయో తెలియదు? తనది ఇదే ఆఖరి రిపోర్టింగ్ అవుతుంది కావచ్చు, ఘాజ పరిస్థితి బాగోలేదు, సగం ఘాజ ఖతం అయిపోయింది అంటున్నది. బ్లెస్సి సురక్షితంగా ఉండాలని, ఒక వైపు ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఆగాలని కోరుకుందాం!ఇదే సందర్భంలో ఘాజ లోనే బిక్కు బిక్కు మంటూ,ఉంటూ, తిండి, కనీసం మంచి నీళ్లు దొరకక అక్కడ బతక లేక, చావలేక, బయటకు వెళ్లలేక పోతున్న సామాన్య కుటుంబాల పరిస్థితి కొన్ని వీడియోస్ లో చూసినపుడు కండ్లు నీళ్లు తీసుకుంటున్నాయి. సామాన్యుల చావులు, వారి శవాల కు లెక్కే లేదు. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ యుద్ధం ఆగాలి. పాలస్థినా నేత యాసర్ అరాఫత్ కాలం నాటి శాంతి ని నెలకొల్పాలి. న్యాయం వైపు ప్రపంచ నేతలు నిలబడి యుద్ధం ఆపాలి. రష్యా – ఉక్రైన్ యుద్ధం పరిస్థితి మాదిరి కాకూడదు.ప్రపంచంలో భూభాగాల ఆక్రమణ,కనిపించని దేవుళ్ళ కోసం మనుషుల లొల్లిలు ఆగాలి!ఈ నేపథ్యంలో ప్రపంచం వ్యాపితంగా కొందరు ఇజ్రాయిల్ వైపు, మరి కొందరు పాలస్థిని ల వైపు నిలబడి మద్దతు ఇస్తూ ప్రదర్శనలు జరుపుతున్నారు. మన దేశంలోని బనారస్ లో ఇజ్రాయిల్ పై దాడికి నిరసనగా ప్రదర్శన జరిగింది. మీడియా లో ఈ పరిస్థితి మీద ఫేక్ న్యూస్ ల ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ఇజ్రాయిల్ పత్రిక అయిన హారెట్జ్ ను, ఇతర కొన్ని నిజం చెప్పే పత్రికల నుంచి మనము నేర్చుకోవాల్సింది ఉంది!అక్కడ ఆ పత్రిక మీద ఇంకా సిబిఐ, ఈడీ, ఐటి దాడులు జరుగలేదు. ప్రభుత్వ ఒడిలో మీడియా కొంత తక్కువే కావచ్చు! అందుకే మీడియా జోలికి వెళ్లడం లేదు కావచ్చు! అనుకుందాం!