ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
అదుపుతప్పి కారును ఢీకొన్న కంటెయినర్
రాజన్న సిరిసిల్ల,నవంబర్6(జనంసాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ముగ్గురిని బలితీసుకుంది. ఇన్నోవా కారు, కంటైనర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న కంటైనర్ కారును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా అనుమానిస్తున్నారు. రహదారిపై వేగంగా వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను కరీంనగర్ జిల్లా రాంపూర్‌కు చెందిన అనిల్‌కుమార్, ఆయన ఇద్దరు కుమారులుగా పోలీసులు గుర్తించారు. అనిల్‌కుమార్ భార్య గీత తీవ్రంగా గాయపడటంతో ఆమెను సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. రహదారి రక్తసిక్తమైంది.