‘చంద్రబాబుకు దమ్ముంటే కేసీఆర్‌తో చర్చకు రావాలి’
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు దమ్ముంటే తమ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ వ్యక్తం చేశారు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పకుండా కేసీఆర్‌వి పిట్లకథలని తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేసీఆర్‌ను విమర్శించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. అసలు చంద్రబాబు, జగన్‌లకు కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని కేసీఆర్ తెలియజేశారు. దొంగచాటుగా జగన్ లక్షల కోట్లు సంపాదించాడని విమర్శించారు. కేసీఆర్‌ను విమర్శించడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయడమేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, ఇది ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని తెలియజేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తానని ప్రకటించిన ఘనగ కేసీఆర్‌దని, అదే పొరపాటును టీడీపీ గెలిస్తే ముఖ్యమంత్రిగా ఇతరులకు చంద్రబాబు అవకాశం ఇస్తాడా అని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రన్న రాజ్యం అంటే ఆకలి చావులు, ఆత్మహత్యలేనా అని నిలదీశారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్, కాంగ్రెస్‌ను ప్రజలు పాతరేస్తరని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతలు ఇకనైనా ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హెచ్చరించారు.ఇక రాజన్న రాజ్యం అంటే సీమాంధ్రులకు పండుగ, తెలంగాణవాదులకు దండగ అని కేటీఆర్ అన్నారు.



