చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ
ఆదిలాబాద్: జిల్లాలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణ సెగ తగిలింది. దిలావార్‌పూర్ మండలం సిర్గాపూర్‌లో పాదయాత్రలో ఉన్న చంద్రబాబును చూడగానే స్థానిక యువకులు ఒక్కసారిగా జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో పలువురు తెలంగాణ వాదులను, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్ తరలించారు.