చంద్రబాబు పై తెలంగాణ వాదులు కోడి గుడ్డతో దాడి
వరంగల్ : జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాలలో చంద్రబాబు పాదయాత్రను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో బాబుపై తెలంగాణ వాదులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకోనడంతో పోలీసులు తెలంగాణ వాదులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న చంద్రబాబుకు తెలంగాణలో పర్యటించే హక్కు లేదని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.