చట్టబద్దంగానే ఎంట్రీ ట్యాక్స్‌ : మంత్రి మహేందర్‌రెడ్డి

2

హైదరాబాద్‌,ఏప్రిల్‌3(జనంసాక్షి): చట్ట ప్రకారమే ఆంధ్రా వాహనాలకు పన్ను వసూలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి  స్పష్టంచేశారు.  పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చట్టంలో ఉంది. కానీ పదేళ్లు ఉమ్మడి పన్నులు అని చట్టంలో లేదని ఆయన పేర్కొన్నారు. రవాణా పన్నుపై కోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పారు. దీనిపై అనసవర విమర్శలు చేయడం సరికాదన్నారు. పన్నుల విషయంలో వెనక్కి తగ్గమన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలపై రవాణాశాఖ దృష్టి పెట్టింది. రోడ్డు ప్రమాదాలు తగ్గేలా చూస్తున్నామని  తరచూ ప్రమాదాలకు కారణాలు అనేకం ఉన్నాయన్నారు. మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల ప్రమోషన్‌ల విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.  ఇంకా ఆర్టీసీ విభజన జరగలేదు. ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సమన్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని చెప్పారు.