చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్సై సంతోష్.

శాంతి భద్రతల పరిరక్షనే ధ్యేయంగా ఎస్ఐ సంతోష్…

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 09 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో డీజే లు వినియోగం, నేషనల్ హైవే ల మీద డాన్సులు వేయడం ప్రమాదమని స్థానిక ఎస్సై పి సంతోష్ హెచ్చరించారు. డీజే లు వినియోగించ రాదని, వినాయక శోభాయాత్రను పోలీసు వారికి కమిటీ వారు తెలియజేసి తగు జాగ్రత్తలు కమిటీ వారు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని శాంతి భద్రతల పరిరక్షణకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెహెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి సైతం వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనం కోసం భద్రాచలం తీసుకొని వస్తారు కాబట్టి బూర్గంపహాడ్ మండలం లోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనం కోసం భద్రాచలం వెళ్లే సమయంలో ప్రధాన రహదారులు, నేషనల్ హైవే పై ఊరేగింపుగా వెళ్లకూడదని, అదే సమయంలో డీజేలు పెట్టి డ్యాన్స్ లు వేయకూడదని పోలీస్ శాఖ నిబంధనల మేరకు కమిటీలు నిమజ్జనం వేడుకలను చేసుకోవాలని కోరారు.వీటిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఉత్సవ కమిటీ వారు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన వేడుకలు ముగించుకొని తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించి పోలీస్ వారికి సహకరించాలని కోరారు.