చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించలేదు : ఎస్సై విటల్ రెడ్డి

 మహిళలను నిర్బంధించిన రాపూర్ గ్రామస్థులను సున్నితంగా  హెచ్చరిక

మహిళలను నిర్బంధించిన వారిపై కేసు నమోదు

 పరిగి రూరల్, అక్టోబర్ 17 ( జనం సాక్షి )
క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు అనుమానంతో
 రాపోలు గ్రామంలో మహిళల నిర్బంధించడం చట్టపరమైన చర్య అని మరి ఎస్ఐ పి. విట్టల్ రెడ్డి అన్నారు..
 ఆరుగురి మహిళలను నిర్బంధించిన వారిపై కేసు నమోదైంది. పరిగి ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పరిగి మండలం రాపోల్​ గ్రామంలో ఆదివారం తెల్ల వారు జామున గ్రామానికి చెందిన ఆరు గురి మహిళలను గ్రామ పంచాతీభవనంలో బంధించారు. ఈ విషయం తెలుసుకొని గ్రామంలో పరిశీలించగా క్షుద్ర పూజలు చేస్తున్నట్లు ఎక్కడా ఆనవాళ్లు లభించలేదని ఎస్సై విటల్ రెడ్డి తెలిపారు. కేవలం అనుమానంతో మహిళలను గదిలో నిర్బందించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ తెలిపారు. కాగా ఎక్కడైనా ప్రజలకు, సమాజానికి ఇబ్బందించినట్లు వ్యవహరించినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అంతేతప్ప చట్టాన్ని చేతులోకి తీసుకోవడం నేరమని ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డి రాపోల్​ గ్రామస్తులకు సున్నితంగా హెచ్చరించారు.