చట్ట విరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి-CITU జిల్లా అధ్యక్షులు ఏ. వెంకటస్వామి డిమాండ్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) అక్టోబర్ 14 : జిల్లా కేంద్రంలోని అగ్రహారం రోడ్డులో ఉన్న అలుప్లెక్స్ కంపెనీలో పనిచేస్తున్న 70 మంది స్థానిక కార్మికులు పెండింగ్ జీతాలు ఇవ్వాలని, 16 నెలల పెండింగ్ పిఎఫ్ డబ్బులు కట్టాలని, వేతన ఒప్పందం కాలపరిమితి ముగిసినందున వెంటనే వేతనాలు పెంచాలని అడిగినందుకు కంపెనీ యాజమాన్యం కార్మికులందరినీ తొలగించిందని డిమాండ్లు పరిష్కరించాలని అడుగుతే కార్మికులను తొలగించడం అన్యాయమని ఈ తొలగింపు చట్ట విరుద్ధంగా జరిగిందని తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు. అలుప్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఏ. వెంకటస్వామి డిమాండ్ చేశారు.
కంపెనీ దగ్గర కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలను తుంగలో తొక్కి చట్ట విరుద్ధంగా కంపెనీ యాజమాన్యం ప్రవర్తిస్తుందని న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అడిగినందుకు స్థానికులను నిర్ధాక్షిణ్యంగా తొలగించి 70 కుటుంబాలను రోడ్డున పడేసిందని అన్నారు స్థానికంగా కంపెనీ పెట్టి ఇక్కడి ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు పొందుతూ స్థానిక కార్మికులను తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పించి పని చేయించుకోవడంవల్ల స్థానికులకు ఉపాధి లేకుండా పోతుందని అన్నారు అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయడం లేదని వారికి కనీస వేతనాలు భద్రతా సౌకర్యాలు ఏవి అమలు చేయడం లేదని బాల కార్మికులతో పని చేయించుకుంటున్నారని అన్నారు
కార్మిక శాఖ అధికారులు కంపెనీని తనిఖీ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జూలై 21వ తేదీ నుండి స్థానిక కార్మికులను విధుల్లోకి రానివ్వకుండా ఆపారని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు అడుగుతుంటే ఆలోచిస్తున్నాం తీసుకుంటాం చూస్తాం చేస్తాం అంటూ చర్చల పేరుతో గత మూడు నెలలుగా కాలయాపన చేశారని చివరికి విధిలేని పరిస్థితుల్లో కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు.
కార్మికులకు మూడు నెలలుగా జీతాలు లేక కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అటు యాజమాన్యం ఇటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని విధుల్లోకి తీసుకోకుంటే ఒక్కొక్క కార్మికునికి ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
యజమాన్యం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు లేకుంటే కార్మికులు రోజువారిగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తూ పోరాటాన్ని ఉదృతం చేస్తారని హెచ్చరించారు.
కార్మిక శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో అలుప్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జి. అభిలాష్ ప్రధాన కార్యదర్శి ఏ.విజయ్ కుమార్ కోశాధికారి పి. గణేష్ ఉపాధ్యక్షులు సి.మధు టి.రాజశేఖర్ సహాయ కార్యదర్శిలు కే. కృష్ణ యు.రఘు ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. మల్తకంటన్నతో పాటు కార్మికులందరూ పాల్గొన్నారు.