చదవాలంటే నడవాలమ్మ ఆడపిల్లల చదువులకు తప్పనితిప్పలు పటిచుకొని పాలకులు

అలంపూర్ సెప్టెంబర్ 9జనంసాక్షి నాయకులు వేదికల మీద, పబ్లిక్ మిట్టింగ్ లోఆడపిల్లలు చదువుకోవాడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, పలు సందర్భాలలో రాజకీయ నాయకులు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నాయకుల మాటలు నీటి మీద గీతలుగా మారిన పరిస్థితినెలకొన్నది . అలంపూర్ మండలం జోగులాంబజిల్లాకుచిట్ట చీవర ప్రాంతం కావడంతో మండలంలోని బైరంపల్లి, గుంది మల్ల తదితర గ్రామాలకు వెళ్లాలంటే కనీస బస్సు సౌకర్యాo లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.గతంలో గుంది మల్ల, భైరంపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండటంతో ఆయా గ్రామాలలో ఉన్నత పాఠశాలలు లేకపోవడం కారణంగా తమ పిల్లలు ఉన్నత చదువులు చదివించాలని కోరికతో తల్లిదండ్రులు ఆడపిల్లలను సైతం చదివించాలని పట్టుదలతో మండల కేంద్ర లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. గత కొంత కాలం నుండి ఆయా గ్రామాలకు బస్సు రాకపోకలు నిలిచిపోవడంతో విద్యార్థుల చదువులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయా గ్రామాల విద్యార్థులు ఆటోలు, ద్విచక్ర వాహనం లలో పోవలసి పరిస్థితి , ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు కాలినడకన వెళ్లి విద్యాభ్యాసం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో కొంత మంది విద్యార్థులను తల్లిదండ్రులు మధ్యలోనే ఆపేసిన సంఘటనలున్నాయి. బీఎస్పీ నాయకులు, ఆయా గ్రామాల నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్న బాలికలతో కలిసి శుక్రవారం జనం సాక్షితో తమ గోడు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉదయం పాఠశాలకు నడుచుకుంటూ రావడం ద్వారా మానసిక ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుందని, అంతేకాకుండా ఒక్కోసారి ఒకటి లేదా రెండు పీరియడ్స్ నీ మిస్ సందర్భాలు చాలా ఉన్నాయి అని విద్యార్థులు అంటున్నారు. అలాగే సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు ఉపాధ్యాయుల నిర్వహిస్తే ఆ క్లాసులలో ఉండలేని పరిస్థితి ఎందుకంటే సాయంత్రం విద్యార్థులు 2 నుంచి 5 కిలోమీటర్లు నడచి పోవాల్సిన పరిస్థితి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వర్షం వస్తే స్కూల్ బుక్స్ సైతం తడిచి పోవడంతో పుస్తకాలు చనిపోతున్నాయి దీంతో చదవడానికి తీవ్ర ఇబ్బందులకు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఈ సందర్భంగా బిఎస్పి అలంపూర్ ఇన్చార్జి మహేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి ఆయా గ్రామా లా నుంచి వచ్చేవిద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని, లేనిచో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇందులో బీఎస్పీ నాయకులు కనకం బాబు, నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు