చదివిన పాఠశాలపై మమకారం-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొల్లేపల్లి పూర్వ విద్యార్థులు
భువనగిరి రూరల్ ఆగస్టు 16 ( జనం సాక్షి)
భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బడి అక్షరం నేర్పుతుంది అక్షరం బతుకునిస్తుంది. బతుకు జీవితకాలంల వెలుగునిస్తుంది… వెన్నెల వెంట నడుస్తుంది. అలాంటి అక్షర వెలుగులను ఆస్వాదించింది. వెలుగునిచ్చిన పాఠశాలకు మౌలిక సదుపాయాలను కల్పించాలి. బొల్లెపల్లి ఉన్నత పాఠశాలలో రెడ్డి నాయక్ తండ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. తాము చదివిన పాఠశాలను మరవకుండా ఆర్థిక సహాయం చేస్తూ ఈ తరం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెడ్డి నాయక్ తండా కు చెందిన వందల మంది విద్యార్థులు చదువుకు న్నారు. వారు రాజకీయంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ప్రభుత్వ ఉద్యోగంలో, వ్యవసాయం ఇతర వృత్తుల్లో కొనసాగుతున్నారు. అయితే మంగళవారం స్వాతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న రెడ్డి నాయక్ తండాకు చెందిన పూర్వ విద్యార్థులు రూ1.50 (ఒక లక్ష యాభై వేలు) మౌలిక సదుపాయాల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయు లకు ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బొల్లెపల్లి సర్పంచ్ బుచ్చిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇతర సిబ్బంది లకు శాలువతో సన్మాని సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత లక్ష్యం చేరుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో చక్కగా చదువుకోవాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనిఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్ది బుచ్చిరెడ్డి, రెడ్డి నాయక్ తండ సర్పంచ్ మంజీ నాయక్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచులు గోపి నాయక్, టీకం, రెడ్డి నాయక్, భూక్యా రాంజీ నాయక్, భూక్య వినోద్ శ్రీనివాస్ నాయక్, కే విజయ్ మల్లేష్ బిక్షపతి రఘు నరేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు