చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం. .

మెరుగైన విద్యా విధానంతో పదవ,ఇంటర్ సర్టిఫికేట్లు.
డిఇఓ గోవిందరాజులు.
ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ల సమావేశం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి):
వివిధ కారణాలతో చదువుకు దూరమై చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరమని నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు అన్నారు.శనివారం డిఈఓ కార్యాలయంలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ లతో సమావేశం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో పదవ తరగతి,ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకై రూపొందించిన అవగాహన ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు.సమావేశంలో  డీఈవో  మాట్లాడుతూ…చదువు మధ్యలో మానేసిన వారిని గుర్తించి ఓపెన్‌ స్కూల్‌ చేర్చి, పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలన్నారు.
ఆగస్టు 14వ తేది వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా, అక్టోబర్ 10వ తేదీ వరకు అపరాధ రుసుముతో ఓపెన్ స్కూల్ లో అడ్మిషన్ లు పొందవచ్చని తెలిపారు.
ఓపెన్ స్కూల్ విద్యా విధానం ద్వారా పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ అన్ని గ్రూపులలో విద్యార్థులకు చదువుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని,14 సంవత్సరాల నిండి చదువు మధ్యలో మానేసిన వారికి,  ఎలాంటి చదువులేని వారికి కూడా ఒక మంచి అవకాశం అని, పదో తరగతి పూర్తి చేసి 15 సంవత్సరాలు నిండిన వారికి కళాశాల చదువు మానేసిన వారికి ఇంటర్ ఫెయిల్ అయిన వారికి ఇంటర్మీడియట్ చదువుకునే ఒక గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందనన్నారు.ఓపెన్ స్కూల్ లో చదివిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కలిగి  ఉంటారని ఇలాంటి విషయంలో ఎలాంటి అపోహలకు అవకాశం లేదని తెలిపారు.జిల్లాలో ఉన్న వివిధ అధ్యయన కేంద్రాలలో ఆగస్ట్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రామ్ సుభాష్ గౌడ్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, సెక్టోరియల్ అధికారి సతీష్ కుమార్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ప్రసాద్ గౌడ్, మరియు  జిల్లా లోని వివిధ అధ్యయన కేంద్రాలు కోఆర్డినేటర్ లు తదితరులు పాల్గొన్నారు.