చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలి

– ఎంపీడీవో శ్రీధర్
– ముష్టిపల్లిలో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
మక్తల్, ఆగస్టు 17,( జనం సాక్షి న్యూస్)
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడా ఆణి ముత్యాలు గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారని అలాంటి క్రీడాకారులను మెరుగైన శిక్షణ ఇచ్చి వారిలోని క్రీడా నైపుణ్యతను వెలికితీస్తే జిల్లా రాష్ట్ర జాతీయస్థాయిలో రాణించగలరని ఎంపీడీవో శ్రీధర్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను స్వాగతిస్తూ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యువతి యువకులకు మక్తల్ మండలంలోని ముష్టిపల్లి క్రీడా ప్రాంగణంలో బుధవారం కబడ్డీ, వాలీబాల్, కోకో, అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు. ఇట్టి పోటీలను మక్తల్ ఎంపీడీవో శ్రీధర్, స్థానిక సర్పంచ్ బి. విజయలక్ష్మి క్రీడాకారులను పరిచయం చేసుకొని మండల స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని యువతి యువకులైన క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసి, ఈనెల 18న నారాయణపేట జిల్లా స్థాయి క్రీడలలో పాల్గొనుటకు ,మండల స్థాయిలో క్రీడా నైపుణ్యతను ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా స్థాయి క్రీడలకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 20 గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎంపీ ఓ ఎం. పావని ఉమ్మడి జిల్లాల షూటింగ్ బాల్ అధ్యక్షుడు విశ్రాంత పీఈటి బి.గోపాలం, స్థానిక టిఆర్ఎస్ నాయకుడు బి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ  కార్యదర్శులు , పీఈటీలు అమ్రేష్, రమేష్ కుమార్, దామోదర్, మక్తల్ మండల సర్పంచుల అధ్యక్షుడు ప్రతాపరెడ్డి ,గాల్ రెడ్డి ,లోకేష్, సుదర్శన్ రెడ్డి, కూర ఆనంద్, ఉపసర్పంచ్ వెంకటన్న, 200 మంది యువతీ యువకులు పాల్గొన్నారు.