చరిత్రలో చిరస్థాయిగా నిలిచేది ఫోటో
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): చరిత్రలో చిరస్థాయిగా నిలిచేది ఫోటో అని జిల్లా టిఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.సోమవారం స్థానిక 45వ వార్డ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన ఫోటోగ్రాఫర్లు యాకయ్య , సైదిరెడ్డిలతో పాటు ఫోటోగ్రాఫర్లు లక్ష్మణ్ , బచ్చు పురుషోత్తమును ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి మరణించిన సజీవంగా మన కళ్ళ ముందు ఉన్నట్టుగా నిలిపేది ఫోటో అని అన్నారు.కాలగర్భంలో కలిసిన చరిత్రను సైతం సజీవంగా నిలిపేది ఫోటో అని, ప్రకృతిలో మనం స్వయంగా చూడలేని ఎన్నో అందాలను కళ్ళకు కట్టినట్టు చూపించేది ఫోటో అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ శ్రీనివాస్, వంగవీటి రమేష్ , బజ్జూర్ శ్రీనివాస్, గుండా శ్రీధ… జూలకంటి నాగరాజు, తేరేటపల్లి సతీష్ , డోగుపర్తి ప్రవీణ్ , సాలయ్య, వెంకటేష్ , మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.