చాంపియన్స్‌ మనమే..


బర్మింగ్‌హామ్‌ : ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా ఓవల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌, ఇంగ్లం డ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కి వర్షం  అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో బారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది కేవలం 46  పరుగులక 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన బొపారా, మోర్గాన్‌లు నికలకడగా అడుతూ, వికెట్‌ పోగోట్టుకోకుండా స్కోరు బోర్డు వేగాన్ని నెమ్మదిగా పెంచసాగారు. ఈ దశలో ఇశాంత్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కోట్టిన్‌ మోర్గాన్‌ శాట్‌కు ప్రయత్నించి అశ్విన్‌కు క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు తరువాత బంతికే మిల్లి శాట్‌కోసం ప్రయత్నించిన బొపారా మల్లీ అశ్వీన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. ఇంగ్లాండ్‌ వెంటవెంటనే వికెట్లు కోల్పొసాగింది. తరువాత బౌలింగ్‌కు వచ్చిన జడెజా రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ గతినే మార్చేసారు. భారత్‌ బ్యాటింగ్‌లో కోహ్లీ 43 పరుగులు, ధావన్‌ 31 పరుగులు, జడేజా 33 పరుగులతో పాటు బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన చేయడంతో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇశాంత్‌ శర్మ, జడేజా బౌలింగ్‌ మ్యాచ్‌గతినే మార్చేసింది.