చాకలిఐలమ్మ విగ్రహా భూమి పూజలో బలరాం జాదవ్.

నేరడిగొండసెప్టెంబర్26(జనంసాక్షి):
మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తినిచ్చి ప్రపంచానికి చాటిన ఐలమ్మ నిప్పుకణికమని బలరాం జాధవ్ అన్నారు.సోమవారం మండలంలోని తేజపూర్ గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ను గ్రామంలో నెలకొల్పబోతున్న చాకలి ఐలమ్మ విగ్రహా భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాఆహ్వానించారు.బలరాం భూమి పూజ చేసి చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు.అయన మాట్లాడుతు ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల పాలనకు ఎదురు నిలిచి వారిని ఎదిరించి  దున్నేవాడిదే భూమి అని బడుగు బలహీన వర్గాలకు ఆమె ఒక దైర్యం అని కమ్యునిష్టు ఉద్యమాలకు ఊపిరి పోసిందని యువకులను ఏకతాటిపై నిలిపి10లక్షల ఎకరాల భూమిని దొరల గడీల నుండి విడిపించిన వీరవనిత అని కొనియాడారు.బలరాంతో పాటు సర్పంచ్ ప్రపుల్ చందర్ రెడ్డి విడిసి అధ్యక్షులు సురేందర్ రెడ్డి రజక సంఘం అధ్యక్షులు రాజు జీవన్ రెడ్డి భూమారెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు హీరాసింగ్ ప్రధాన కార్యదర్శిలు సాబ్లే సంతోష్ ప్రశాంత్ చొక్కపల్లి రాములు గట్టు నారాయణ రాజశేఖర్ రమేష్ రమణ శ్రీధర్ రెడ్డి అరవింద్ యువజన సంఘంల  నాయకులు తదితరులు ఉన్నారు.