చింత ప్రభాకర్ ను వరించిన బి.ఆర్.ఎస్ టికెట్
పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 21 :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్ నుండి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. సంగారెడ్డి నియోజకవర్గానికి మళ్లీ చింత ప్రభాకర్ కు ఎమ్మెల్యే టికెట్ను ప్రకటించారు . ప్రస్తుత టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్ కు ఎమ్మెల్యే టికెట్ ఖరారు కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు . చింతా ప్రభాకర్ క్యాంప్ కార్యాలయం కార్యకర్తలతో నిండిపోయి ఆయనకు పూర్తి మద్దతును ప్రకటించారు. ఈసారి కచ్చితంగా సంగారెడ్డి గడ్డపై బిఆర్ ఎస్ జెండాను ఎగరవేయడం ఖాయమని కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభాకర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, ప్రభాకర్ అన్న జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సంగారెడ్డి లోని న్యూ బస్టాండ్ నటరాజ్ టాకీస్ వద్ద బాణ సంచాలను పేల్చారు. జిల్లా కలెక్టరేట్ ముందు, ఓల్డ్ బస్టాండ్ మరియు సంగారెడ్డిని ప్రతి వార్డులో కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణ సంచాను తేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు.ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు చింతా ప్రభాకర్ సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో సంగారెడ్డిలో తాను గెలవనున్నట్టు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరిని కలుపుకొని పోతానని, అందరుకు తనకు మద్దతునిస్తూ పార్టీని గెలిపిస్తారని అన్నారు.