చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖమ్మం అర్బన్: చికిత్స పొందుతూ ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. 13వతేదీన 45ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అతిగా మద్యం తాగి అనారోగ్యంపాలయ్యాడు. దీంతో అతడిని 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందగా త్రీటౌన్ పోలీసుల కేసు నమోదుచేశారు