చిక్కడపలివ్ల నల్లపోచమ్మ ఆలయంలో చోరీ

హైదరాబాద్‌ : చింతలబస్తీలోని దుర్గామాత ఆలయంలో చోరీ ఘటన మరవకముందే నగరంలో మరో దొంగతనం చోటుచేసుకుంది. చిక్కడపల్లి శ్రీరామ్‌నగర్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో దొంగలు చొరబడి రూ.3 లక్షలకు విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో క్లూస్‌టీంతో పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. నగరంలోని ఆలయాల్లో చోరీ ఘటనలు పెరుగుతుండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.