చిక్కడపల్లి గ్రామంలో బోనాల పండుగ
రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామంలో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు ,గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి వనభోజనాలకు తరలివెళ్లారు. గ్రామంలోని అన్ని దేవతామూర్తులకు భక్తులు నైవేద్యాలు సమర్పించేందుకు డప్పువాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య బోనాలతో తరలివెళ్లారు. ఊరంతా భక్తిశ్రద్దలతో సంతోషంగా గ్రామపెద్దల సమక్షంలో పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుష్పాలతరమేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు నక్క మక్కయ్య, రాజయ్య, రాము, మల్లేష్, అశోక్, హనుమంత తదితరులు పాల్గొన్నారు.