చిక్ మద్దూర్ లో డ్రైనేజీ పనులు ముమ్మరం
హత్నూర (జనం సాక్షి)
మండలం పరిధిలోని చిక్ మద్దూర్ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.గ్రామ సర్పంచి శ్రీనివాస్ రెడ్డి క్షేత్ర స్థాయిలో డ్రైనేజీ పనులను పర్యవేక్షిస్తూ పనుల్లో నాణ్యతను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో వంద శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడమే లక్ష్యమన్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గ్రామస్తుల సహకారం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.