చిట్టాపూర్ గ్రామంలో జరం సర్వే.
మల్లాపూర్ ,(జనంసాక్షి )జులై:27 మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో స్థానిక ఏఎన్ఎం విజయ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి గృహాన్ని సందర్శించి జర సర్వే నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో ఇంటి బయట మురికి నీరు నిలువ ఉంచుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటువ్యాధులు ప్రబలకుండా శుభ్రంగా ఉండాలని వేడివేడి ఆహార పదార్థాలు భుజించాలని వేడి చేసి చల్లారిన నీటిని మాత్రమే త్రాగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ స్నేహ ఆశా కార్యకర్తలు స్వప్న సునీత అనూష పాల్గొన్నారు