చిత్రకళ విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందిస్తుంది.
– బెల్లంపల్లి తహసిల్దార్ కుమార స్వామి.
పోటో: విద్యార్థులతో మాట్లాడుతున్న తహసీల్దార్.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 7, (జనంసాక్షి)
చిత్రకళ విద్యార్థుల ఆలోచనలను గొప్ప సృజనాత్మకతవైపుకు తీసుకుపోతుందని బెల్లంపల్లి తహసిల్దార్ కుమారస్వామి అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో భాగంగా జరిగిన చిత్రకళ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
ఉత్తమమైన ఆలోచనలు మరియు స్వచ్ఛమైన పరిసరాలు ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి తోడ్పడతాయన్నారు. సంక్షేమ గురుకులాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు ఉత్తమంగా ఉన్నాయన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు సమిష్టిగా గురుకులాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బెల్లంపల్లి సిఓఈ కి రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉందని దానిని ఉత్తమ కార్యాచరణతో నిలుపుకోవాలన్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ ఐనాల సైదులు గురుకులంలోని పలు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకుపోయారు. ముఖ్యంగా వసతి గృహానికి ఎదురుగా పల్లపు ప్రాంతంలో చెరువు నీళ్ళు నిలిచి ఉండి ఇబ్బందిగా మారిందని చెప్పారు. అదే విధంగా నీటి సమస్య ఉందన్న ఆయన దృష్టికి తీసుకెళ్లారు తహసీల్దార్ స్పందిస్తూ భవిష్యత్తులో గురుకులంలోని సమస్యలను తీర్చడానికి తన వంతు సహకరిస్తానన్నారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనశాల వసతి గృహాన్ని పరిశీలించారు. భోజనశాలలోని వంట పాత్రలు ఆహార పదార్థాల నిల్వను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. వంటశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండడాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో
వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ దాసం అజిత, ఉపాధ్యాయులు కొక్కుల రాజేశ్వర్, షిండే దత్త ప్రసాద్, శ్రీనివాస్ పొన్నం, శ్యాంసుందర్ రాజు, భోగ అశోక్, పొన్నాల రాజ్ కుమార్, దుర్గం రమాదేవి, ఎండి కౌసర్, గోమాస చంద్రశేఖర్, శాతరాజు తిరుపతి, కామెర ప్రేమలత, యంసాని హారిక, రామిశెట్టి రామారావు , సింగారావ్ స్రవంతి, కాసర్ల రాజేందర్ ,కోట్రంగి గణపతి, ఎండి సబియ భాను తదితరులు పాల్గొన్నారు